తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వైరస్‌ లోడును బట్టి గాలిలో వ్యాప్తి - telangana latest news

కరోనా వైరస్‌ లోడును బట్టి గాలిలో కరోనా వ్యాపిస్తున్నట్లు గతంలో సీసీఎంబీ చేసిన అధ్యయనంలో వెల్లడైందని ఆ సంస్థలోని అటల్‌ ఇంక్యుబేషన్‌ (ఏఐసీ) కేంద్రం సీఈవో డాక్టర్‌ మధుసూదన్‌రావు తెలిపారు. గాలిలో కరోనా వైరస్‌పై అంతర్జాతీయ సంస్థల తాజా ఫలితాలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

corona, corona news, covid news
కరోనా వ్యాప్తి, కొవిడ్ వ్యాప్తి, లోడ్​ను బట్టి కరోనా వ్యాప్తి

By

Published : Apr 18, 2021, 6:53 AM IST

హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో చేసిన అధ్యయనం ప్రకారం.. కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల నుంచి రెండు మీటర్ల దూరం వరకు వైరస్‌ సూక్ష్మ కణాలు వ్యాపించి రెండు గంటల కంటే ఎక్కువే గాలిలో ఉంటున్నాయని అటల్‌ ఇంక్యుబేషన్‌ (ఏఐసీ) కేంద్రం సీఈవో డాక్టర్‌ మధుసూదన్‌రావు తెలిపారు. కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులు.. ఒక గదిలో ఎంతసేపు గడిపారనే దానిపై వ్యాప్తి ఆధారపడి ఉందన్నారు.

  • కొవిడ్‌ వార్డుల్లో పాజిటివ్‌ వ్యక్తులు రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు, వారు కూర్చున్న ప్రదేశం నుంచి 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం వైరస్‌ వ్యాప్తి గాలిలో ఉన్నట్లు తేలింది.
  • గాలిలో కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నా మాస్క్‌, భౌతిక దూరంతో కొవిడ్‌ బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. టీకాలు వేయించుకోవాలి.
  • కుటుంబంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని త్వరగా గుర్తించి విడిగా ఉంచగలిగితే మంచిది. గదుల లోపల గాలి ద్వారా వ్యాప్తి ఎక్కువగా ఉంది.
  • రెండో ఉద్ధృతిలో వ్యాప్తి వేగంగా ఉండటానికి కొత్తరకం వైరస్సే కారణం అనడానికి ఏ ఆధారాలు లేవు. యూకే, ఆఫ్రికా రకం వైరస్‌ కలిసి వ్యాపిస్తున్న డబుల్‌ మ్యూటెంటే కారణమని చెప్పలేం. కొన్ని కేసుల ఆధారంగా ఒక నిర్ణయానికి రాలేం.
  • మొదటి వేవ్‌లోనూ పిల్లలకు వైరస్‌ సోకింది. ఈసారి మరింత ఎక్కువగా కొవిడ్‌ బారిన పడుతున్నారు.

జన సమూహాల్లోకి వెళ్లవద్దు

వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నందున ముఖ్యంగా జన సమూహాలు ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని.. హాల్‌, ఆడిటోరియం వంటి ప్రదేశాలకు వెళ్లకపోవడమే సురక్షితమని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్ర అన్నారు. ఎల్లప్పుడూ మాస్క్‌ ధరించాలని.. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని, అందుబాటులో ఉన్న రెండు టీకాలు సురక్షితమైనవేనని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details