26 వరకు అసెంబ్లీ సమావేశాలు... 18న రాష్ట్ర బడ్జెట్ - తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
13:19 March 15
ఈ నెల 26 వరకు పది రోజుల పాటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. సభాపతి పోచారం అధ్యక్షతన బీఏసీ సమావేశం కాగా... బడ్జెట్ సమావేశాల అజెండాపై నేతలు చర్చించారు. 18న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సర్కారు స్పష్టం చేసింది. 23, 22, 23 తేదీల్లో బడ్జెట్‌పై సభలో చర్చించనున్నారు. 26న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించి... సభ ఆమోదం తెలపనుంది.
బడ్జెట్ అజెండా...
- 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సమాధానం
- ఈ నెల 18న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఈనెల19, 21 తేదీల్లో శాసనసభ సమావేశాలకు సెలవులు
- ఈనెల 20, 22 తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ
- ఈనెల 23, 24, 25, తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ
- ఈనెల 26న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం
కాంగ్రెస్ డిమాండ్...
సాగు చట్టాలపై చర్చించి సభలో తీర్మానం చేయాలని బీఏసీలో భేటీలో కాంగ్రెస్ కోరింది. న్యాయవాద దంపతుల హత్య, పెట్రో ధరలపై చర్చించాలని డిమాండ్ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల వల్ల కలిగే నష్టాలపై కూడా చర్చించాలని ప్రతిపక్షం కోరింది. సమావేశంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, కమలాకర్, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, కాంగ్రెస్ నేత భట్టి, మజ్లిస్ సభ్యుడు పాషా ఖాద్రి పాల్గొన్నారు.