బడ్జెట్‌పై ఉభయసభల్లో సాధారణ చర్చలో భాగంగా... ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. పూర్తి స్థాయి బడ్జెట్‌పై శనివారం చర్చ ప్రారంభమైంది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మండలిలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సమాధానం ఇవ్వనున్నారు. వివిధ కమిటీలకు సభ్యులను ఎన్నుకునేందుకు ప్రభుత్వం ఇవాళ సభలో తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. ప్రజాపద్దుల సంఘం, ప్రభుత్వరంగ సంస్థల సమితి, అంచనాల కమిటీకి అసెంబ్లీ నుంచి తొమ్మిది మంది, మండలి నుంచి నలుగురిని ఎన్నుకునేందుకు శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెడతారు.
శాసనసభ కమిటీ సభ్యుల ఎన్నికకు తీర్మానం
సెలవుల అనంతరం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరఫున... అసెంబ్లీలో కేసీఆర్, మండలిలో హరీశ్ రావు నేడు సమాధానమివ్వనున్నారు. వివిధ కమిటీలకు సభ్యులను ఎన్నుకునేందుకు తీర్మానం ప్రవేశపెడతారు.
జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీకి అసెంబ్లీ నుంచి ఒకరిని ఎన్నుకునేందుకు రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీర్మానం ప్రవేశపెడతారు. సభ్యుల ఎన్నిక కోసం సభాపతి షెడ్యూల్ ప్రకటిస్తారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రైతుబీమా, షీ-టీమ్స్, వైద్యుల పోస్టుల భర్తీ, కేసీఆర్ కిట్, బుద్వేల్‌కు హైకోర్ట్ తరలింపు, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. మండలిలో మెట్రో స్టేషన్లకు రవాణా, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, యురేనియం తవ్వకాలు, జాతీయ రహదారుల విస్తరణ, గృహనిర్మాణ పథకాలు, హైదరాబాద్‌లో వర్షాకాల సమస్యలు తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
ఇదీ చూడండి: యూరియా కొరతపై ప్రతిపక్షాల రాద్దాంతం సరికాదు: మంత్రి నిరంజన్ రెడ్డి