రేపటి నుంచి జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ ఆవరణలో చిన్నపాటి మరమ్మతులు చేసి, రంగులు వేశారు. పోలీసులు తనిఖీ చేసేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేసి.... ప్రవేశ ద్వారాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు, మీడియా వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం కల్పించారు.
పాస్‌లు ఉన్న వారికే అనుమతి
అసెంబ్లీలోకి పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతించే విధంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు ఎవరికి ఎలాంటి పాస్‌లు ఇచ్చారో అక్కడే ఉండేట్లు, ఇతర ప్రాంతాల్లో తిరగకుండా ఆంక్షలు విధించారు.