తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రధాని మోదీతో అసోం సీఎం భేటీ.. సరిహద్దు ఘర్షణపై చర్చ

అసోం- మిజోరాం సరిహద్దు సమస్యపై చర్చించడానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. జూలై 26న ఆ రాష్ట్రాల సరిహద్దులో ఘర్షణలు చెలరేగి ఆరుగురు అసోం పోలీసులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇదే తరహాలో మళ్లీ అల్లర్లు చెలరేగకముందే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ఇరు రాష్ట్రాలు కేంద్ర సాయం కోరిన దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Assam cm Himanta Biswa Sarma
Assam cm Himanta Biswa Sarma

By

Published : Aug 9, 2021, 3:21 PM IST

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. అసోం- మిజోరాం సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అందువల్ల ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

అసోం-మిజోరాం సరిహద్దుల్లో జూలై 26న ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో మిజోరాం పోలీసులు అసోం పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. ఆ తర్వాత ఇరు రాష్ట్రాలు వివాద పరిష్కారానికి కేంద్రం సాయం కోరాయి.

బ్రిటీష్ కాలం నాటి సరిహద్దు వివాదం ఒక్కసారిగా బయటకు రావడమే ప్రధాన కారణమని.. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమస్యపై చర్చించేందుకు అసోం సీఎం హిమంత్‌ బిశ్వ శర్మ సోమవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

అసోం- మిజోరాం సరిహద్దుల సమస్య, శాంతి పునరుద్ధరణపై కీలకంగా చర్చించనున్నారు. ఈ రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యకు కేంద్రం పరిష్కారం చూపెడుతుందని అంతా భావిస్తున్నారు.

ఇదీ చూడండి: లోక్​సభలో మూడు బిల్లులకు ఆమోదం- రేపటికి వాయిదా

ABOUT THE AUTHOR

...view details