తెలంగాణ

telangana

ETV Bharat / city

RGV TWEET: రేపే 'ఆశ ఎన్‌కౌంటర్‌' సినిమా ట్రైలర్ - ఆర్జీవీ

'ఆశ ఎన్​కౌంటర్' ట్రైలర్​ను రేపు ఉదయం విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ట్వీట్​ చేశారు. ఈ సినిమా నవంబర్ 26న థియేటర్లలో విడుదల కానుందని పేర్కొన్నారు.

asha Encounter trailer
asha Encounter trailer

By

Published : Oct 30, 2021, 7:01 PM IST

'ఆశ ఎన్​కౌంటర్' చిత్ర ట్రైలర్​ను ఆదివారం ఉదయం​ 9.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ట్విటర్​ వేదికగా తెలిపారు. ఈ సినిమా నవంబర్ 26, 2019న జరిగిన ఒక భయంకరమైన ఘటన ఆధారంగా రూపొందించామని.. ఈ నవంబర్ 26న థియేటర్లలో విడుదల కానుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నగర శివారులో ఓ యువతిపై కొంతమంది యువకులు సామూహిక హత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించిన ఈ ఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆనంద్‌ చంద్రా డైరెక్టర్. శ్రీకాంత్‌, సోనియా, ప్రవీణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 26న థియేటర్లలో విడుదల కానుంది.

ఇదీ చూడండి:'పుష్పకవిమానం' ట్రైలర్​.. సాంగ్​తో రజనీకాంత్​

ABOUT THE AUTHOR

...view details