తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీఎస్ఆర్టీసీకి వరుసగా రెండోసారి జాతీయ అవార్డు - ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ అవార్డులు

జాతీయ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీ మరోసారి అవార్డును గెలుచుకుంది. 2021 ఏడాదికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో 'డిజిటల్ టెక్నాలజీ సభ' అవార్డును దక్కించుకుంది.

ఏపీఎస్ఆర్టీసీకి వరుసగా రెండోసారి జాతీయ అవార్డు
ఏపీఎస్ఆర్టీసీకి వరుసగా రెండోసారి జాతీయ అవార్డు

By

Published : Feb 24, 2021, 9:26 PM IST

ఐటీ విభాగంలో ఏపీఎస్​ఆర్టీసీకి వరుసగా రెండోసారి జాతీయ అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో వివిధ సంస్థలతో పోటీ పడి 2021 ఏడాదికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో 'డిజిటల్ టెక్నాలజీ సభ' అవార్డును గెలుచుకుంది. ఐటీ విభాగంలో గతేడాది కూడా డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు దక్కింది.

యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు ఈ అవార్డును ప్రకటించారు. వర్చువల్ సెమినార్​లో ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ ఈ అవార్డును అందుకున్నారు.

ఇదీ చదవండి: భారత్​ బయోటెక్​ను సందర్శించిన ఉక్రెయిన్​ ఆరోగ్య శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details