తెలంగాణ

telangana

ETV Bharat / city

AP PGESET EXAM POSTPONED : ఏపీపీజీఈసెట్‌ నేటి పరీక్షలు వాయిదా

ఏపీలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీపీజీఈసెట్‌కు సంబంధించి ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్‌ బంద్‌ నేపథ్యంలో వాయిదా వేసినట్లు ఏపీపీజీఈసెట్‌ ఛైర్మన్‌, కన్వీనర్‌ ప్రకటించారు.

ఏపీపీజీఈసెట్‌ నేటి పరీక్షలు వాయిదా
ఏపీపీజీఈసెట్‌ నేటి పరీక్షలు వాయిదా

By

Published : Sep 27, 2021, 9:40 AM IST

భారత్‌ బంద్‌ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీజీఈసెట్‌ ఛైర్మన్‌, కన్వీనర్‌ ప్రకటించారు. జియో ఇంజినీరింగ్‌ అండ్‌ జియో ఇన్ఫర్మాటిక్స్‌(జీజీ) ఫార్మసీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సవరించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని, 28, 29 తేదీల్లోని పరీక్షలు షెడ్యూలు ప్రకారం కొనసాగుతాయని వివరించారు.

రాష్ట్రంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే వామపక్షాలు, తెలుగుదేశం, కాంగ్రెస్‌, రైతు సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొంటున్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త బంద్​లో ఏపీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మరోవైపు పాఠశాలలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అవ్వడం వల్ల రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి.

ABOUT THE AUTHOR

...view details