తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వరాష్ట్రానికి పంపించాలంటూ ఏపీ హోంగార్డుల విజ్ఞప్తి - Andhra Pradesh Home Guards in Telangana

ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగి ఉండి తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డులు... స్వరాష్ట్రానికి పంపించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేడుకుంటున్నారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు తలకిందులై కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నామని వాపోతున్నారు. వీలైనంత త్వరగా తమను ఏపీకి పంపితే రుణపడి ఉంటామని ముఖ్యమంత్రులను వేడుకుంటున్నారు.

Appeal of Andra Pradesh Home Guards to be sent to Own State to CM KCR
స్వరాష్ట్రానికి పంపించాలంటూ ఏపీ హోంగార్డుల విజ్ఞప్తి

By

Published : Oct 31, 2020, 12:17 PM IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగి ఉన్న రెండువేల మంది హోంగార్డులు ఆంధ్రప్రదేశ్​కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలివ్వడం లేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించినా... ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్వరాష్ట్రానికి పంపించండి...

కరోనా వైరస్ ప్రభావంతో ఇళ్లకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న హోంగార్డులకు ఏపీలోనూ నష్టం జరుగుతోంది. ఇంటర్మీడియేట్, డిగ్రీ చదువుకున్న హోంగార్డులు తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుండదని పేర్కొన్నారు. ఇంటర్ వరకూ ఆంధ్రప్రదేశ్​లో విద్యాభ్యాసం చేసినందున నాన్ - లోకల్ అభ్యర్థులవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పదేళ్ల నుంచి హైదరాబాద్​లో ఉంటున్నా.. విద్యార్హతలున్నా వీరు కానిస్టేబుళ్లుగా ఉద్యోగం పొందలేకపోతున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా తమకు స్వరాష్ట్రానికి పంపితే రుణపడి ఉంటామని ముఖ్యమంత్రులను వేడుకుంటున్నారు.

స్వరాష్ట్రానికి పంపించాలంటూ ఏపీ హోంగార్డుల విజ్ఞప్తి

ఇవీచూడండి:రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం... నేడు ప్రారంభించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details