తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు... చంద్రబాబు మినహా మిగతా ఎమ్మెల్యేలు? - అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు

Assembly Meetings: వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అన్న అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చర్చించారు. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ శాసనసభలో లేవనెత్తాల్సిన అవసరం ఉన్నందున సమావేశాలకు వెళ్లడమే సరైందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు... చంద్రబాబు మినహా మిగతా ఎమ్మెల్యేలు?
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు... చంద్రబాబు మినహా మిగతా ఎమ్మెల్యేలు?

By

Published : Feb 25, 2022, 9:54 AM IST

Assembly Meetings: వచ్చే నెలలో జరిగే ఏపీ శాసనసభ, శాసనమండలి బడ్జెట్‌ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు మినహా, మిగతా తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే యోచనలో ఉన్నారు. సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అన్న అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చర్చించారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వ విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటన్నింటినీ శాసనసభలో లేవనెత్తాల్సిన అవసరం ఉన్నందున సమావేశాలకు వెళ్లడమే సరైందన్న అభిప్రాయాన్ని ఎక్కువమంది వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అసెంబ్లీకి వెళ్లినా సమస్యలు ప్రస్తావించేందుకు, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరేమోనని ఒకరిద్దరు ప్రస్తావించినట్లు సమాచారం. గత ఏడాది నవంబరు 19న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తన కుటుంబసభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేశారంటూ సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... సమావేశాల్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details