తెలంగాణ చేపట్టే అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలి: ఏపీ - తెలంగాణ వార్తలు
17:06 July 08
'తెలంగాణ చేపట్టే అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలి'
కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టులతో ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ కాజేస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. 8 ప్రాజెక్టులతో 183 టీఎంసీలు వాడేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.
అనుమతులు లేకుండానే కృష్ణా నీటిని వినియోగిస్తున్నట్టు ఫిర్యాదు చేసిన ఆయన.. కృష్ణాపై తెలంగాణ అన్యాయంగా చేపట్టే ప్రాజెక్టులను నిలువరించాలని కోరారు.
ఇదీ చదవండి: Jagan: పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: జగన్