తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సినిమా థియేటర్ల యజమాన్యం కీలక భేటీ..! - AP Movie theaters issue

AP Movie theaters issue: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలను అమలు చేయడంలేదన్న కారణాలతో పలుచోట్ల థియేటర్లను సీజ్‌ చేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యజమానులు బోర్డులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల యజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు, తదితరులు రాజమండ్రిలో సమావేశం కానున్నారు.

ap cinema theaters issue
ap cinema theaters issue

By

Published : Dec 27, 2021, 3:24 PM IST

AP Movie theater owners meet: ఏపీ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై థియేటర్ల యజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు కలిసి రాజమండ్రిలో సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

జీఓ 35లోని నిబంధనలను అమలు చేయడంలేదన్న కారణాలతో పలుచోట్ల థియేటర్లను అధికారులు సీజ్‌ చేశారు. లోపాలపై యజమానులకు నోటీసులు జారీచేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యజమానులు బోర్డులు పెడుతున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్​ ... నాలుగు కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details