AP high court: అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట
13:28 September 13
అమరావతి రైతులకు ఏపీ హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకున ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన రిటర్న్ గిప్ట్ ప్లాట్లను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో సంబంధిత రైతులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ దానిపై విచారణ జరిగింది. రైతులకు రిటర్న్ గిప్ట్‌గా ఇచ్చిన ప్లాట్లను స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని రైతుల తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ప్లాట్లను ఇచ్చినట్లు ఆ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని ధర్మాసనానికి తెలిపారు. దీంతో ఆ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జీవోకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏఎంఆర్డీఏను ఆదేశించింది.
ఇదీ చదవండి:Review Petition in High court: 'నిమజ్జనం ఆంక్షలు సడలించండి... 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తాం'