తెలంగాణ

telangana

ETV Bharat / city

ఖైదీల వేతనాల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు - ap latest news

ఖైదీల వేతనాల పెంపు నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నాలుగు వారాల్లో అమలు చేయాలని ఆదేశించింది.

ap high court
ఖైదీల వేతనాల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

By

Published : Mar 22, 2021, 6:52 PM IST

ఖైదీల వేతనాలను పెంచాలని ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి చెల్లించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించగా... ఖైదీల వేతనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయాన్ని మాత్రం అమలు చేయలేదు.

ఈ విషయంపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. పెంచిన వేతనాలను నాలుగు వారాల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇవీచూడండి:పాఠశాల విద్యార్థులకు సెలవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details