AP in Parliament : ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 22వ తేదీ వరకు బహిరంగ మార్కెట్ నుంచి 45,500 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
'ఈ ఏడాది బహిరంగ అప్పు రూ.45,500 కోట్లు' - AP debts
AP in Parliament : ఈ ఏడాది మార్చి 22వ తేదీ వరకు బహిరంగ మార్కెట్ నుంచి ఏపీ ప్రభుత్వం రూ.45,500 కోట్ల రుణాన్ని తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ మేరకు తెదేపా ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీతో సహా... అన్ని రాష్ట్రాలకు నికరణ రుణ పరిమితిని జీఎస్‌డీపీలో 4శాతానికి పరిమితం చేసింది. అందులో 0.50 శాతం మూలధన వ్యయం కోసం ఖర్చు చేయాగా....మరో 0.50 శాతం విద్యుత్ రంగంలో రుణాలను తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని 293(3) నిబంధన కింద 2021-22లో బహిరంగ మార్కెట్ నుంచి 46,443 కోట్ల రూపాయల రుణ సేకరణకు కేంద్రం ఏపీ ప్రభుత్వానికి అనుమతిని ఇచ్చింది. అందులో 5,309 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కోసం... మిగిలిన 3,716 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్కరణ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక సంస్థలు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలు, ఇతర ప్రభుత్వ అప్పులు మినహా.... మెుత్తంగా 37, 418 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోవడానికి వీలు కల్పించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
- ఇదీ చదవండి :తెలంగాణ ప్రజలు కరెంట్‌ను తెగ వాడేస్తున్నారు..