తెలంగాణ

telangana

ETV Bharat / city

వీర జవాను ప్రాణత్యాగం వెలకట్టలేనిది: ఏపీ సీఎం జగన్ - జమ్ము కశ్మీర్ టెర్రరిస్టుల దాడిలో తెలుగు జవాన్లు అమరులు

జమ్ము-కశ్మీర్​లో ముష్కరుల దాడిలో అమరుడైన వీర జవాను ఆంధ్రప్రదేశ్ వాసి.. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. జవాను కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. వారిని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

వీర జవాను ప్రాణత్యాగం వెలకట్టలేనిది: ఏపీ సీఎం జగన్
వీర జవాను ప్రాణత్యాగం వెలకట్టలేనిది: ఏపీ సీఎం జగన్

By

Published : Nov 9, 2020, 9:15 PM IST

జమ్మూకశ్మీర్​లో ముష్కరుల దాడిలో అమరుడైన వీర జవాను ఆంధ్రప్రదేశ్ వాసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఏపీ రాష్ట్రప్రభుత్వం రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి తెలిపారు.

చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన వీర జవాను ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి... మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే బాబు సైతం వారితో ఉన్నారు.

సంబంధిత కథనాలు ..

ABOUT THE AUTHOR

...view details