తెలంగాణ

telangana

ETV Bharat / city

మాస్కులు అడిగినందుకు వైద్యుడిపై సస్పెన్షన్​ వేటు - ఏపీలో కరోనా వార్తలు

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కనీసం మాస్కులు కూడా ఇవ్వటం లేదంటూ ఆరోపించిన ఏపీలోని ఓ ప్రాంతీయ ఆస్పత్రి వైద్యుడిపై సస్పెన్షన్​ వేటు పడింది. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో పైఅధికారులు చర్యలు తీసుకున్నారు.

doctor
doctor

By

Published : Apr 8, 2020, 8:50 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి వైద్యుడు సుధాకర్​ సస్పెన్షన్​కు గురయ్యారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనస్తీషియా వైద్యుడిగా పని చేస్తున్న ఆయన ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రక్షణ సామగ్రి లేకుండానే కరోనా బాధితులకు చికిత్స చేయాలని వైద్యులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన అన్నారు. వైద్యులకు మాస్కులు సైతం ఇవ్వటం లేదని మండిపడ్డారు.

వీటితో పాటు అనుభవం లేని వైద్యులతో ఆపరేషన్లు చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు సైతం ఆసుపత్రిని పట్టించుకోలేదని విమర్శించారు. పేరుకే పెద్దాసుపత్రి కానీ సరైన వైద్యులు లేరని గళమెత్తారు. వైద్యుడు సుధాకర్‌ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో రావటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అతన్ని సస్పెండ్ చేసింది. ఈ పూర్తి ఘటనపై కలెక్టర్‌ ఆదేశాలతో ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారు.

ఇదీ చదవండి:కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి

ABOUT THE AUTHOR

...view details