AP Cinema Tickets Price Issue : సినిమా టికెట్ల వ్యవహారంపై కొత్త కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా థియేటర్లలో టికెట్ ధరల కోసం ఉన్నతాధికారులు, ఎగ్జిబిటర్లు, సినీగోయర్ల ప్రతినిధులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
AP Cinema Tickets Price Issue : సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం
11:41 December 28
AP Cinema Tickets Price Issue : సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Cinema Tickets Price Dispute : హోమ్, రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, సమాచార, న్యాయశాఖల అధికారులు.. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ సహా డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్లతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. సినీ థియేటర్ల వర్గీకరణ, వాటికి అనుగుణంగా ధరలను ఈ కమిటీ రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలి.
మరోవైపు..
Film Ticket Price Issue: ఆంధ్రప్రదేశ్లో జీవో 35 ప్రకారం థియేటర్ల నిర్వహణ సాధ్యం కాదని.. సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాపోయారు. లేదంటే థియేటర్లు మూసేయడం మినహా మరో మార్గం లేదని రాజమహేంద్రవరంలో తెలిపారు. థియేటర్లను ఏబీసీ కేటగిరీల కింద విడగొట్టకుండా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికీ ఒకేరకమైన టికెట్ టారిఫ్ అమలు చేయాలని కోరారు.
- ఇదీ చదవండి :ఏపీ సినిమా థియేటర్ల యజమాన్యం కీలక భేటీ..!