AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై.. సీఎం జగన్ ప్రస్తావించారు. చాలా మంది పోటీలో ఉన్నారన్న ముఖ్యమంత్రి.. మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన పక్కన పెట్టినట్లు భావించొద్దని చెప్పారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనని అన్నారు.
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సీఎం కీలక వ్యాఖ్యలు - AP Cabinet Reshuffle latest news
AP Cabinet Reshuffle: ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలామంది పోటీలో ఉన్నారని అన్నారు. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇస్తామని చెప్పారు.
ap cm-jagan
మంత్రివర్గం లేని వారు.. పార్టీకి పని చేయాలని సీఎం సూచించారు. పదవి నుంచి తప్పించిన వారికి.. జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది మంత్రివర్గంలో ఉంటారని సీఎం జగన్ వెల్లడించారు. ఈ నెల 15న జరిగే వైఎస్సార్సీఎల్పీ భేటీలో మంత్రివర్గ విస్తరణపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:రూ.2.56 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్