హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలిక హత్యచార ఘటనను మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాంగారు బస్తీలో బాలికపై సుమిత్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు.
Rape: హైదరాబాద్‌లో మరో బాలికపై అత్యాచారం! - అత్యాచారం
సైదాబాద్ బాలిక హత్యచార ఘటనను మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మాంగారు బస్తీలో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు.
rape
బాలిక అరుపులతో స్థానికులు ఘటనాస్థలికి వెళ్లి రక్షించారు. ఈ క్రమంలో సుమిత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడు హబీబ్‌నగర్ పరిధిలో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఘటనాస్థలిని ఏసీపీ నరేందర్‌రెడ్డి పరిశీలించి విచారణ చేపట్టారు. మరోవైపు వైద్యపరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:CP Anjani Kumar: పోలీసులకు దొరికిపోతానన్న భయంతోనే ఆత్మహత్య: సీపీ అంజనీ కుమార్