తెలంగాణ

telangana

By

Published : Mar 20, 2020, 5:41 AM IST

Updated : Mar 20, 2020, 7:03 AM IST

ETV Bharat / city

రాష్ట్రంలో 16కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 16కు చేరాయి. వీరందరిలో ఒకరికి వ్యాధి నయంకాగా అతడిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ నెల 18న ఎనిమిది మందికి కొవిడ్‌-19 పాజిటివ్​ వచ్చింది. గురువారం మరో ముగ్గురికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ప్రకటించింది.

telanagana
రాష్ట్రంలో 16కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో 16కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభణ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 16 మందికి వైరస్‌ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం మరో ముగ్గురు వ్యక్తులకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పేర్కొంది.

నిన్న ముగ్గురికి..

ఈనెల 14న దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. నిన్న అతడికి కరోనా రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. ఈనెల 18న లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తిలో వైరస్​ లక్షణాలు కనిపించగా ఆస్పత్రికి తరలించారు. శాంపిళ్లు ల్యాబ్‌కు పంపించగా అతడికి కూడా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. అతడికి కూడా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరందరిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.

70 వేల మందికి పైగా థర్మల్‌ స్క్రీనింగ్‌..

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న ఒక్కరోజే 711 మందికి థర్మల్ స్క్రీనింగ్ చేశారు. ఇప్పటి వరకు 71,256 మందికి థర్మల్ స్క్రీనింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు. అవసరమైతే 104 నంబర్​ను సంప్రదించవచ్చన్నారు.

ఇవీ చూడండి:'సంకల్పం, సంయమనంతోనే కరోనాపై విజయం'

Last Updated : Mar 20, 2020, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details