తెలంగాణ

telangana

ETV Bharat / city

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్​పై కేసు నమోదు.. - తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర వార్తలు

ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్​పై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి ఓ హోటల్​లో సమావేశం ఏర్పాటు చేశారని ఆయనపై... 188, 269, 270 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లు, ఎపిడమిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

police case has been registered against dhulipalla
police case has been registered against dhulipalla

By

Published : Jun 6, 2021, 7:50 PM IST

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్​పై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి ఓ హోటల్​లో సమావేశం ఏర్పాటు చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. పటమట పోలీస్ స్టేషన్ ఎస్సై కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్​లో తెలిపారు. 188, 269, 270 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లు, ఎపిడమిక్ యాక్ట్ కింద నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

గత నెల 29న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నోవాటెల్ హోటల్లో 20 మందితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారని వివరించారు. కరోనా వేళ నిబంధనలు పాటించలేదన్నారు. సమావేశానికి హాజరైన అందరూ హోటల్​లోని లాబీలో కూర్చుని భోజనం చేశారని.. అనంతరం సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో తెలిపారు. 601,602 రూమ్​లను సంగం డెయిరీ పేరుపై రిజర్వ్ చేశారని ప్రస్తావించారు.

ఇదీ చదవండి :corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details