ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణల ఫిర్యాదులపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణల ఫిర్యాదులను స్వీకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. నామినేషన్ ఉపసంహరణ కోసం నిర్దేశించిన మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా దీనిపై వివరాలు పంపించాలని సూచించింది.
బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులు స్వీకరించాలి: ఏపీ ఎస్ఈసీ - andhra pradesh municipal elections
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులను స్వీకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆ రాష్ట్ర ఎస్ఈసీ ఆదేశించింది. అసహజ రీతిలో నామినేషన్ల ఉపసంహరణ జరిగితే..వాటిపై ఫిర్యాదులు స్వీకరించి తమకు చెప్పాలని సూచించింది.
ఏపీ ఎస్ఈసీ
అసహజ రీతిలో నామినేషన్ల ఉపసంహరణ జరిగి ఉంటే అలాంటి పరిస్థితులపై ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఎస్ఈసీకి నివేదించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఉపసంహరణ జరిగితే వాటిని పునఃపరిశీలించి.. పునరుద్ధరిస్తామని ఏపీ ఎస్ఈసీ స్పష్టం చేసింది.