AP Omicron Cases: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు - total AP Omicron Cases
00:02 December 26
ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు
AP Omicron Cases: ఏపీ మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ నిర్థరణ అయినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల కుటుంబసభ్యులకు నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి ఏపీకి 67 మంది వచ్చారు. వీరిలో 12 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిందన్నారు. తాజాగా నమోదైన రెండింటితో కలిపి ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకి చేరింది.
ఇదీచూడండి:Telangana Omicron Cases: రాష్ట్రంలో మరో 3 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు