ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు (Ap Corona cases) స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 58,054 మంది నమూనాలు పరీక్షించగా 1,010 కొత్త కేసులు నమోదయ్యాయి. 13 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 1,149 మంది కోలుకున్నారు.
AP CORONA CASES: ఏపీలో కొత్తగా 1,010 కరోనా కేసులు, 13 మంది మృతి - AP Corona cases
ఏపీలో కొత్తగా 1,010 కరోనా కేసులు (Ap Corona cases)నమోదు కాగా.. 13 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి మరో 1,149 మంది బాధితులు కోలుకున్నారు.
AP CORONA CASES
ఏపీలో ప్రస్తుతం 11,503 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, కృష్ణా, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో 244, చిత్తూరు జిల్లాలో 147 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:Corona cases in India: దేశంలో 23వేలు దాటిన కరోనా కేసులు