తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ: తిరుమల వకుళమాత ఆలయం వద్ద పురాతన శాసనం - latest news on vakulamatha temple

తిరుమల వకుళమాత ఆలయంలో చారిత్రక శాసనం బయట పడింది. పేరూరు గ్రామంలో వకుళ మాత ఆలయ అభివృద్ధి పనులు చేస్తుండగా శాసనం కనిపించింది. 11వ శతాబ్దంలో తమిళంలో నాటి చోళ రోజు మొదటి కులోత్తంగ చోళుడు జారీ చేసిన శాసనంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.

an-ancient-inscription-found-at-the-vakulamata-temple
ఏపీ: తిరుమల వకుళమాత ఆలయం వద్ద పురాతన శాసనం

By

Published : Aug 5, 2020, 12:08 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి తల్లిగా పూజలు అందుకునే వకుళమాత ఆలయంలో చారిత్రక శాసనం ఒకటి బయట పడింది. తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామంలో వకుళ మాత ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ పురాతన శాసనం వెలుగు చూసింది.

ఈ శాసనాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు 11వ శతాబ్దంలో తమిళంలో నాటి చోళ రోజు మొదటి కులోత్తంగ చోళుడు జారీ చేసిన శాసనంగా గుర్తించారు. ఈ శాసనం ఆధారంగా ఇక్కడే విష్ణు మూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్లు చెబుతున్నారు. తితిదేలో వకుళామాత ఆలయానికి సంబంధించి..గతంలో శాసన ఆధారాలు దొరకని పక్షంలో... ఈ శాసనంపై పురావస్తు శాఖ అధికారులు మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నారు.

ఇదీ చదవండి: రామాలయం భూమిపూజ- 10 కీలకాంశాలు

ABOUT THE AUTHOR

...view details