తెలంగాణ

telangana

ETV Bharat / city

Amith Shah: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అమిత్​షా - శ్రీశైలంలో అమిత్​షా

శ్రీశైలం మల్లన్నను కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శంచుకున్నారు. కేంద్ర హోం మంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Amith Shah
అమిత్​షా

By

Published : Aug 12, 2021, 5:00 PM IST

Updated : Aug 12, 2021, 6:03 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శ్రీశైలంలో పర్యటించారు. కుటుంబసభ్యులతో కలిసి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి చేరుకున్న అమిత్‌షాకు.. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆలయ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అమిత్‌షా దర్శించుకున్నారు.

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అమిత్​షా

ఆలయ ప్రాంగణంలో అమిత్ షా మొక్కలు నాటారు. ఈ మధ్యనే తవ్వకాల్లో బయటపడిన తామ్ర శాసనాలను పరిశీలించారు. శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం సున్నిపెంట నుంచి హెలికాప్టర్​లో అమిత్ షా దంపతులు హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. అనంతరం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి దిల్లీకి చేరుకున్నారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Aug 12, 2021, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details