తెలంగాణ

telangana

ETV Bharat / city

రోడ్లు ఊడ్చిన సర్పంచ్​.. కారణం తెలిస్తే షాక్​..

ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పంచాయతీలో నిధులను ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆ గ్రామ సర్పంచ్ అరుణాదేవి రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. కనీసం ఉద్యోగులకు ఆరువేల వేతనం కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా

By

Published : Sep 10, 2022, 4:55 PM IST

ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ నిధులను తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్ల తాత్కాలికంగా పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అరుణాదేవి అన్నారు. ఈ విషయంపై ఆలూరు పట్టణంలో రోడ్లపై చెత్తను ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం పంచాయతీ కార్మికులతో కలిసి పట్టణంలో చెత్త రిక్షాను తోసుకుంటూ నిరసన తెలిపారు.

పంచాయతీ నిధులను తీసుకుని తిరిగి చెల్లించకుంటే తాము పంచాయతీలో అభివృద్ధి పనులు ఎలా చేసేదని అరుణాదేవి ఆవేదన వ్యక్తంచేశారు. సిబ్బందికి కనీసం రూ.6 వేల వేతనం చెల్లించలేని దౌర్భాగ్యం నెలకొందని ఆమె అన్నారు.

ABOUT THE AUTHOR

...view details