తెలంగాణ

telangana

ETV Bharat / city

కూత పెడుతున్న రైళ్లు.. క్యూ కట్టిన ప్రయాణికులు... - సికింద్రాబాద్​ ప్రత్యేక రైళ్లు

దేశవ్యాప్తంగా మళ్లీ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 200 సాధారణ రైళ్లకు కేంద్రం అనుమతితో రైల్వే స్టేషన్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. కరోనా నియంత్రణలో భాగంగా గంటన్నర ముందుగా స్టేషన్​కు రావాలని రైల్వేశాఖ ప్రయాణికులకు సూచించింది.

trains
trains

By

Published : Jun 1, 2020, 8:53 AM IST

Updated : Jun 1, 2020, 9:24 AM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మళ్లీ ప్రయాణికులతో సందడిగా మారింది. నిన్నటి వరకు ప్రత్యేక రైళ్లకే పరిమితమైన ప్రాంగణంలో ఇవాళ్టి నుంచి సాధారణ రైళ్లకు కూడా అనుమతి ఇచ్చారు. ఉదయం ఘనపూర్ ఎక్స్​ప్రెస్ కోసం ప్రయాణికులు బారులు తీరారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్​ఫాం వరకు ప్రయాణికులు క్యూ కట్టారు.

లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 70 రోజుల అనంతరం రైళ్లు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తమ పనుల నిమిత్తం గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రయాణికుల అందరిని భౌతిక దూరం పాటించే విధంగా రైల్వే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాతే స్టేషన్ లోపలికి అనుమతిస్తున్నారు.

ప్రస్తుతానికి రెగ్యులర్ ఛార్జీలతోనే టికెట్లు ఇస్తుండగా... ఈనెల 29 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభించనున్నారు.

Last Updated : Jun 1, 2020, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details