లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో ప్రధాన రహదారులన్నీ బోసిపోతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బంద్ పాటించాలని ఆదేశించింది. నగరంలోని అన్ని దుకాణాలతో పాటు పెట్రోల్ బంక్‌లు కూడా పూర్తి మూసివేశారు.
రాత్రిపూట నగరంలో అన్నీ బంద్
కరోనా కట్టడి చర్యలతో హైదరాబాద్‌లో అందరూ ఇళ్లకే పరిమితవుతున్నారు. నగరంలోని రహదారులు వెలవెలబోతున్నాయి. ఎవరైనా బయటకు వస్తే పోలీసులు తనిఖీ చేసి పంపిస్తున్నారు.
రాత్రిపూట నగరంలో అన్నీ బంద్
నగరంలో రహదారులపై ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనవసరంగా ఎవరూ బయట తిరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా బయటకు వస్తే పూర్తి వివరాలు తెలుసుకొని, అవసరమా లేదా అని నిర్ధరించిన తర్వాతనే వారిని పంపిస్తున్నారు.