రాష్ట్రవ్యాప్తంగా మరి కొన్ని గంటల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దాదాపు పది నెలల పాటు మహమ్మారితో పోరాడుతూ.... వైరస్ బారిన పడిన వారికి తొలి డోస్ ఇచ్చేందుకు సర్కారు సన్నద్ధమైంది. ఇప్పటికే ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
'టీకా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరంలేదు' - తెలంగాణలో కరోనా వ్యాక్సిన్
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌కు పూర్తి సంసిద్ధంగా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 10 వేల మంది సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్‌పై శిక్షణ ఇచ్చామని తెలిపారు. వ్యాక్సిన్‌కి శాస్త్రబద్ధంగా అనుమతులు ఇచ్చారని తెలిపిన ఈటల.... ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
eetala