అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ దగ్గర ఫిబ్రవరి 27న తప్పిపోయిన.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు శివకుమార్ సాహు కోసం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి.. బాలుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డయ్యాయి. ఈ ఫుటేజిని పోలీసులు విడుదల చేశారు. ఎవరికైనా బాలుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అలిపిరి వద్ద తప్పిపోయిన బాలుడి కోసం ముమ్మర గాలింపు - తిరుపతి తాజా వార్తలు
తిరుపతిలో తప్పిపోయిన ఛత్తీస్‌గఢ్ బాలుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డ్ కాగా.. వాటిని విడుదల చేశారు. దుండగులు ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అలిపిరి పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అలిపిరి వద్ద తప్పిపోయిన బాలుడి కోసం ముమ్మర గాలింపు