తిరుమల శ్రీవారి సేవలో 'అఖండ' టీమ్ Akhanda Movie Team visits Tirumala: తిరుమల శ్రీవారిని అఖండ చిత్ర బృందం దర్శించుకుంది. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీందర్ రెడ్డి కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం శేషవస్త్రంతో బాలకృష్ణను సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కరోనా పరిస్థితుల్లో అఖండ చిత్రం సినీ పరిశ్రమకు ఊపిరి పోసిందని బాలయ్య అన్నారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం వద్ద బాలయ్య సందడి
Balakrishna Visits Tirumala : బుధవారం రాత్రి.. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని బాలకృష్ణ, బోయపాటి శీను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ మేధో దక్షిణామూర్తి సన్నిధిలో ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు.
బాలకృష్ణను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం సందడి నెలకొంది. అక్కడినుంచి శ్రీవారిని దర్శనార్థం అఖండ చిత్ర బృందం తిరుమలకు చేరుకుంది. రాదేయం అతిథి గృహానికి చేరుకున్న బృందానికి అభిమానులు స్వాగతం పలికారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.