తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు' - dasoju shravan abour covid cases in telangana

కరోనా పాజిటివ్ కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రెమ్​డెసివిర్ ఇంజక్షన్ కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు.

dasoju sravan, dasoju sravan  fires on kcr
దాసోజు శ్రవణ్, కేసీఆర్​పై శ్రవణ్ ఫైర్

By

Published : Apr 20, 2021, 10:15 AM IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్​కు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కొవిడ్ పడకలు దొరకక బాధితులు ఆందోళన చేస్తున్నారని అన్నారు.

కరోనా సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉంటే సీఎం ఏం చేశారని శ్రవణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంత మంది వైద్యులను, నర్సులను నియమించారో అడిగితే సమాధానం లేదని విమర్శించారు. బస్తీ దవాఖానాలను కొవిడ్ పరీక్ష, టీకా కేంద్రాలుగా మార్చాలని సూచించినా స్పందించడం లేదని మండిపడ్డారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. రాష్ట్ర ఈసీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి.. కేసీఆర్​కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details