రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతోందని... రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్లిందని మాజీ విప్ అనిల్ తెలిపారు. జగ్గారెడ్డి, వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డిలు ఆలోచించుకోవాలన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్‌తో పాటు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, మానవతారాయ్ మాట్లాడారు.
పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే...
సీనియర్లకు పార్టీలో ఏదైనా సమస్యలుంటే గాంధీభవన్‌లో చర్చించుకోవాలని అనిల్ సూచించారు. వీహెచ్ ఒక ఎమ్మెల్సీ ద్వారా హరీశ్ రావును కలవాల్సిన పనేముందని ప్రశ్నించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్ద నాయకులు పనిచేసినా వారిని సస్పెండ్ చేయాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో కొత్త టీమ్స్ వచ్చాక పార్టీ బలోపేతమయిందని ప్రజల్లో విశ్వాసం పెరిగిందని బెల్లయ్యనాయక్ అన్నారు. పార్టీలో కార్యకర్తలు చెమటోడ్చిపని చేస్తున్నారని వారికి నష్టం చేయవద్దన్నారు.
కోవర్టులున్నారనే అనుమానాలు...