సినీ తారలను వదలని కరోనా.. వైరస్ కోరల్లో మరో నటి - jayasudha
07:04 February 08
సినీ తారలను వదలని కరోనా.. వైరస్ కోరల్లో మరో నటి
సినీ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, కీర్తి సురేశ్, త్రిష ఇలా చాలామంది కొవిడ్ బారినపడి కోలుకున్నారు. తాజాగా సహజ నటి జయసుధ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ.. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. జయసుధ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
14 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చిన జయసుధ.. తనదైన నటనతో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు. దాదాపు 48 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించారు. చివరగా 2019లో వచ్చిన మహర్షి, రూలర్ సినిమాల తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కొద్ది రోజులుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె వైరస్ కోరల్లో చిక్కుకున్నారు.
TAGGED:
jayasudha