తెలంగాణ

telangana

ETV Bharat / city

డియర్​ కామ్రేడ్స్​... నల్లమలను కాపాడుకుందాం - nallamala forest

మన కోసం, మన భవిష్యత్​ కోసం నల్లమలను కాపాడుకుందామని సూచించారు ప్రముఖ నటుడు విజయ్​ దేవరకొండ. సేవ్​ నల్లమల యాష్ ట్యాగ్​తో ట్విట్టర్​ వేదికగా ఆయన స్పందించారు.

డియర్​ కామ్రేడ్స్

By

Published : Sep 12, 2019, 5:28 PM IST

ట్విట్టర్​ వేదికగా నల్లమలను కాపాడుకుందామని యువ నటుడు విజయ్ దేవరకొండ సూచించారు. 20 వేల ఎకరాల నల్లమల అడవి నాశనమయ్యే ప్రమాదముందని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికే మనం నదులు, చెరువులను కలుషితం చేశామని పేర్కొన్నారు. తాగేందుకు నీరు దొరకని పరిస్థితికి వచ్చామని గుర్తుచేశారు. గాలి, నీరు కలుషితమవుతున్నాయని అన్నారు. కొన్ని నగరాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయని తెలిపారు. యురేనియం కొనుక్కోవచ్చు, అడవులను కొనగలమా! అంటూ ప్రశ్నించారు. అవసరమైతే సౌర విద్యుత్‌ను వినియోగంలోకి తెద్దామని సూచించారు. ప్రతి ఇంటి మీద సౌర ఫలకలు ఏర్పాటు చేసేలా చట్టాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మిగిలిన కొద్దిపాటి వనరులను కూడా నాశనం చేసి ఏం సాధిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details