యువ కథానాయకుడు ఆది పిన్నిశెట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటారు. రంగస్థలం సినిమాలో నటించిన తన సహచర నటుడు శత్రు విసిరిన సవాల్‌ను ఆది స్వీకరించాడు. ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ఆది... విరామ సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఆది అభినందనలు తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లో రకరకాల ఛాలెంజ్‌లను స్వీకరించే యువత... బాధ్యతగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని సూచించారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఆది కోరారు. బాలీవుడ్ కథానాయకుడు మిథున్ చక్రవరి, ఆకాంక్ష సింగ్, నిక్కీ గల్రానీ, రాహుల్ రవీంద్రకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆది విసిరాడు.