తీగ లాగితే డొంకంతా కదిలినట్లుంది షేక్‌పేట మండల కార్యాలయంలో అవినీతి బాగోతం. ఓ వ్యక్తి భూమి విషయమై ఆర్ఐ లంచం తీసుకున్న వ్యవహారం ఎమ్మార్వో వరకు వెళ్లింది. హైదరాబాద్ గాంధీనగర్‌లో షేక్‌పేట్ ఎమ్మార్వో సీహెచ్ సుజాత ఇంట్లో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ టీం డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగాయి.
షేక్‌పేట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు - acb latest news in telangana
హైదరాబాద్ షేక్‌పేట తహసీల్దార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో దాదాపు 30 లక్షల రూపాయల నగదు, విలువైన ఆభరణాలను గుర్తించారు.
షేక్‌పేట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఈ తనిఖీల్లో దాదాపు 30 లక్షల రూపాయల నగదు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువైన సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా