సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల మందులు కొనుగోలు కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈఎస్‌ఐ పరిధిలోని డిస్పెన్సరీలు, ఆసుపత్రుల్లో మందులు సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించి డబ్బులు దండుకున్న కేసులో దేవికారాణి, పద్మ సహా 16 మందిని ఇప్పటికే అనిశా అధికారులు అరెస్టు చేశారు. డొల్ల సంస్థ సృష్టించి దేవికారాణి డబ్బులు దండుకున్న బాగోతం వెలుగు చూసింది. కుత్బుల్లాపూర్‌లో రమాదేవి అనే మహిళ పేరిట సాయి శ్రీనివాస డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్థాపించినట్లు తేలింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రాజేశ్వర్‌రెడ్డితో కలిసి దేవికారాణి ఏర్పాటు చేసిన ఈ డొల్ల సంస్థపై అధికారులు దాడులు చేశారు. ఈఎస్‌ఐ నుంచి ఎంత మేరకు నిధులు మళ్లించారు అనే విషయం తేల్చేందుకు అధికారులు బుధవారం రాత్రి పొద్దుపోయేవరకు సోదాలు కొనసాగించారు.
ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో మలుపు
ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో మరో కోణం వెలుగుచూసింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రాజేశ్వర్ రెడ్డితో కలిసి దేవికారాణి డొల్ల సంస్థ సృష్టించినట్లు అధికారులు గుర్తించారు.
ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో మలుపు