తెలంగాణ

telangana

ETV Bharat / city

షేక్​పేట్​ ఘటనపై అనిశా విచారణ - acb more focused on sheekpet issue

acb Inquired shekpet issue
లంచం తీసుకున్న కేసులో అనిశా విచారణ

By

Published : Jun 7, 2020, 11:51 AM IST

Updated : Jun 7, 2020, 1:57 PM IST

11:49 June 07

షేక్​పేట్​ ఘటనపై అనిశా విచారణ

లంచం తీసుకున్న కేసులో అనిశా విచారణ

భూవివాద పరిష్కారం కోసం లంచం తీసుకుంటూ చిక్కిన షేక్​పేట తహసీల్దార్​, ఆర్ఐ, బంజారాహిల్స్​ ఎస్సైలను విచారణ కొనసాగుతోంది. నాంపల్లి అనిశా కార్యాలయానికి ముగ్గురిని తీసుకొచ్చిన అధికారులు  ఈ కేసులో ఎంతమంది పాత్ర ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆర్ఐ, ఎస్సైలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన అధికారులు.. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.  

ఏం జరిగింది.. 

       హైదరాబాద్​ షేక్​పేట్​ తహసీల్దార్​ కార్యాలయం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ... అనిశా అధికారులకు శనివారం చిక్కారు. షేక్‌పేట ఆర్‌ఐ నాగార్జునరెడ్డిని.. బంజారాహిల్స్​లోని ఒకటిన్నర ఎకరాలకు సంబంధించిన భూమి హద్దులు చూపించాలంటూ ఖలీద్‌ అనే వ్యక్తి ఆశ్రయించాడు. సంబంధిత భూమి... కేసులో ఉండడం వల్ల ఆర్‌ఐ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాదం పరిష్కరించాలంటే రూ. 30 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. శనివారం రూ. 15 లక్షలు... తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో  తీసుకుంటుండగా... అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

  ఇదే కేసు విషయంలో బంజారాహిల్స్​లో పనిచేస్తున్న రవీందర్ నాయక్... బాధితుడి నుంచి రూ. 3 లక్షలు డిమాండ్ చేసి రూ. లక్ష 50 వేలు తీసుకున్నాడు. మళ్లీ కేసు నుంచి తప్పించాలంటే మరో రూ. 3 లక్షలు  ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సై రవీందర్ నాయక్​పై కూడా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు... దర్యాప్తు చేపట్టారు.  అనంతరం షేక్​పేట  తహసీల్దార్‌ సుజాత ఇంట్లోను సోదాలు చేసిన అధికారులు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.  

ఇవీచూడండి:  రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్​ఐ

Last Updated : Jun 7, 2020, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details