ఈఎస్ఐ మందు కొనుగోళ్ల కుంభకోణం కేసులో నిందితుల కస్టడీపై అనిశా న్యాయస్థానం రేపు తీర్పు వెలువరించనుంది. నిందితులను కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అనిశా అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు... ఈ కేసును మూడు సంవత్సరాల నుంచి విజిలెన్స్ దర్యాప్తు చేసిందని , ఇప్పుడు మళ్లీ కస్టడీకి అవసరం లేదని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. కస్టడీలోకి తీసుకుకోవాలంటే సరైన ఆధారాలు చూపించాలని కోరారు. కస్టడీ పిటిషన్ కొట్టివేసి నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న అనిశా కోర్టు బెయిల్ పిటిషన్ను ఈనెల 9కి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై రేపు తీర్పు వెలువరించనుంది.
ఈఎస్ఐ నిందితుల కస్టడీ పిటిషన్పై రేపు అనిశా కోర్టు తీర్పు - ఈఎస్ఐ నిందితులు
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణం
12:20 October 04
ఈఎస్ఐ నిందితుల బెయిల్ పిటిషన్ ఈనెల 9కి వాయిదా
Last Updated : Oct 4, 2019, 1:13 PM IST