ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ప్రభుత్వ అధ్యాపకుడు మధుసూదన్ రెడ్డిని అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా మధుసూదన్ రెడ్డిని ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు... ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన 9 ఇళ్లలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. మధుసూదన్ రెడ్డి రూ.3కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. రెండు ఇళ్లతో పాటు... నార్సింగిలో విలువైన భూమి ఆయన పేర ఉన్నట్లు గుర్తించారు. ఇళ్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేసినప్పటికీ... తక్కువ ధర చూపించినట్లు అనిశా గుర్తించింది. మధుసూదన్ రెడ్డికి చెందిన రెండు కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమాస్తుల కేసులో ప్రభుత్వ అధ్యాపకుడు అరెస్టు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ప్రభుత్వ అధ్యాపకుడు మధుసూదన్ రెడ్డిని అనిశా అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రూ.3 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
అక్రమాస్తుల కేసులో ప్రభుత్వ అధ్యాపకుడు అరెస్టు