బషీర్ బాగ్లో నిజాం కళాశాల వద్ద విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ వద్ద పోలీసుల తీరును నిరసిస్తూ... ర్యాలీగా వచ్చిన ఏబీవీపీ నాయకులను గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించిన విద్యార్థులను అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
విద్యార్థుల నిరసన..... పోలీసుల అరెస్ట్
బుధవారం అసెంబ్లీ ముట్టడిలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ.. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు నిజాం కాలేజీ వద్ద అందోళనలు చేపట్టారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
విద్యార్థుల నిరసన..... పోలీసుల అరెస్ట్
ఉద్యమ పార్టీ అని చెప్పుకునే తెరాస... నిరసన వ్యక్తం చేస్తున్న విద్యర్థులపై ఇంత అమానుషంగా ప్రవర్తించడమేంటని నాయకులు ప్రశ్నించారు. విద్యార్థులపై అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:ఖుష్బూ జీవితమే నాకు ఆదర్శం: దిశా పటానీ