తెలంగాణ

telangana

ETV Bharat / city

అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​స్టేషన్​ ప్రారంభించిన హోంమంత్రి - రామోజీ ఫౌండేషన్‌ నిర్మించిన అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​స్టేషన్​ ప్రారంభం

Ramoji Foundation: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్​లో రామోజీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో అధునాతన హంగులతో నిర్మించిన పోలీస్​స్టేషన్‌ భవనం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

Abdullahpurmet new police station inugrantion program
Abdullahpurmet new police station inugrantion program

By

Published : Jun 22, 2022, 3:29 PM IST

Ramoji Foundation: సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్‌ మరో అడుగు ముందుకు వేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్​లో అధునాతన హంగులతో పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని నిర్మించింది. దాదాపు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. 9వేల చదరపుటడుగులకు పైగా విస్తీర్ణంలో జీ ప్లస్‌ వన్‌ పద్దతిలో భవనాన్ని నిర్మించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఫిలింసిటీ డైరెక్టర్‌ శివరామకృష్ణ, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే నూతన భవనాన్ని అందుబాటులోకి తెచ్చిన రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సేవలను హోంమంత్రి కొనియాడారు

"అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​స్టేషన్​ను ఇంత చక్కగా నిర్మించిన రామోజీ ఫౌండేషన్​కు ధన్యవాదాలు. శంకుస్థాపన చేసిన సంవత్సర కాలంలో అద్భుతంగా నిర్మించి ఇవ్వటం గొప్ప విషయం. రామోజీ ఫౌండేషన్​ తన వంతు సామాజిక బాధ్యతగా.. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆ సంస్థ ఎండీ విజయేశ్వరిని అభినందిస్తున్నాను. కొత్త పోలీస్​స్టేషన్​ ప్రారంభోత్సవం సందర్భంగా.. పోలీసులందరికీ శుభాకాంక్షలు." - మహమూద్​ అలీ, హోంమంత్రి

రామోజీ ఫౌండేషన్‌ నిర్మించిన అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​స్టేషన్​ ప్రారంభం..

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details