ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె కార్యక్రమం.. ఉత్సాహంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు.. అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నారు. చీరలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మిఠాయిలు, ఇతర వస్తువులతో అమ్మవారికి సారె అందజేస్తున్నారు.
indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఉత్సాహంగా ఆషాఢ సారె కార్యక్రమం - విజయవాజ దుర్గ ఆలయం వార్తలు
ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై ఉత్సాహంగా ఆషాఢ సారె కార్యక్రమం
అనంతరం ఆరో అంతస్థులోని మహా మండపం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవమూర్తి వద్దకు చేరుకుని అమ్మవారి నామస్మరణతో పారాయణాలు చేస్తున్నారు. సారె సమర్పించిన భక్త బృందాలతో ఆలయ అర్చకులు పూజ చేయిస్తున్నారు.