EarthQuake: పులిచింతల సమీపంలో వరుస భూప్రకంపనలు - earthquakes latest news
11:03 August 08
పులిచింతల సమీపంలో వరుస భూప్రకంపనలు
పులిచింతల సమీపంలో వరుస భూప్రకంపనలు (EarthQuake)సంభవించాయి. ఉదయం 7.15 నుంచి 8.20 గంటల మధ్య భూప్రకంపనలు వచ్చాయి. పులిచింతల పరిసర ప్రాంతాల్లో మూడుసార్లు భూప్రకంపనలు రాగా... భూకంపలేఖినిపై తీవ్రత 3, 2.7, 2.3గా నమోదు అయింది.
చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. గతం వారం రోజులుగా పులిచింతల సమీపంలో భూమి కంపిస్తుంది. భూమి కంపించినట్లు భూభౌతిక పరిశోధన ముఖ్య శాస్త్రవేత్త శ్రీనగేశ్ వెల్లడించారు. మూడుసార్లు భూమి కంపించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:KCR REVIEW: 'రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని అంశాలపై బలమైన వాణి వినిపించాలి'