తెలంగాణ

telangana

ETV Bharat / city

DalitBandhu: మరో నాలుగు మండలాల్లో పథకం అమలుపై నేడు సమావేశం - సీఎం కేసీఆర్ వార్తలు

నాలుగు మండలాల్లో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. దళితబంధు పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.

DalitBandhu
DalitBandhu

By

Published : Sep 13, 2021, 5:00 AM IST

దళితబంధును హుజూరాబాద్‌ నియోజకవర్గం, వాసాలమర్రిలో ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మరో నాలుగు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేయడంపై సన్నాహక సమావేశాన్ని ఇవాళ ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నారు.

మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తిలోని తిర్మలగిరి, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ, జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

సన్నాహక సమావేశానికి ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఆయా జిల్లాల జడ్పీ ఛైర్మన్లు, కలెక్టర్లు, సంబంధిత నియోజకవర్గాల శాసనసభ్యులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ, సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా హాజరవుతారు. పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొంటారు.

ఇవీ చూడండి: CM KCR: ఇకపై వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details