తెలంగాణ

telangana

ETV Bharat / city

పండ్లే వారికి ఆహారం.. మెట్రో పిల్లర్లే వారి నివాసం - Hyderabad news

అతను చేసే హమాలీ పనే ఆ కుటుంబానికి పొట్ట నింపేది. అనుకోని ప్రమాదంలో గాయపడిన అతను.. కుటుంబంతో సహా రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూలీ చేసి కుటుంబాన్ని పోషిద్దామన్నా.. శరీరం సహకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో మెట్రో పిల్లర్లే ఆ కుటుంబానికి నివాసమయ్యాయి. అక్కడున్న మార్కెట్​కు వచ్చే క్రయవిక్రయదారులు అందించే పండ్లే వారికి భోజనమవుతున్నాయి.

family in trouble, labor family in trouble, Hyderabad news
ఆపదలో హమాలీ కుటుంబం, హైదరాబాద్ వార్తలు

By

Published : May 18, 2021, 8:04 AM IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతుల పేరు పుష్ప, అప్పన్న. అప్పన్న హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌లో హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవారు. 2నెలల క్రితం స్టౌవ్‌ పేలడంతో తీవ్ర గాయాలయ్యాయి. హమాలీ పనిచేస్తూ అంతోఇంతో కూడబెట్టుకున్న డబ్బు వైద్య ఖర్చులకే సరిపోయింది. అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఇంటిని ఖాళీ చేయించాడు. అప్పటి నుంచి మెట్రో పిల్లర్లే ఆ కుటుంబానికి ఆవాసమయ్యాయి.

హమాలీ పని చేయడానికి శరీరం సహకరించకపోవడంతో పొట్టనింపుకోవడమూ భారంగా మారింది. దీంతో మార్కెట్‌కు వచ్చే వ్యాపారులు, అమ్మకందారులు ఇచ్చే పుచ్చకాయలనే తింటూ ఆ దంపతులు ఆకలి తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి కరోనా ఆపత్కాలంలో వీరికి ఏదైనా సాయమందించాలని అక్కడున్నవారంతా కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details