akhanda theatre fire accident : వరంగల్లోని జెమిని థియేటర్‌లో నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం ప్రదర్శితమవుతున్న సమయంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రేక్షకులంతా సినిమాలో నిమగ్నమై ఉండగా థియేటర్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగింది. పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.